DSC | తెలంగాణలో 5 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి ఎస్‌జీటీ, ఎస్ఏ, భాషా పండిట్లు, పీఈటీ పోస్టులకు కలిపి మొత్తం 1,01,176 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 43,634 దరఖాస్తులు వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్‌కు అత్యధికంగా 16,311, బయోలాజికల్ సైన్స్‌కు 13,547 దరఖాస్తులు వచ్చాయి. ఇక డీఎస్సీ ఫీజు చెల్లించేందుకు గడువు ఈ నెల 20. దరఖాస్తుల సమర్పణకు 21వ తేదీ వరకు గడువు ఉంది. అయితే పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో దరఖాస్తుల గడువును పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసిన విషయం విదితమే. వాయిదా పడ్డ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. తేదీలు ఇంకా ఖరారు కాలేదు.