Site icon vidhaatha

Pathan Movie Row | చిక్కుల్లో షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’.. సినిమాను బ్యాన్‌ చేయాలని కోర్టులో పిటిషన్

Pathan Movie Row | బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్‌’. ఈ సినిమా విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకున్నది. ఇటీవల సినిమాకు సంబంధించి మొదటి పాట ‘బేషరమ్‌ రంగ్‌’ పాట విడుదలైంది. ఆ తర్వాత సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై రచ్చ కొనసాగుతున్నది. ఇప్పటికే పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. తాజాగా బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

‘పఠాన్‌’ చిత్రంలోని పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. పాటతో పాటు సినిమా విడుదలను నిషేధించాలని పిటిషన్‌లో డిమాండ్‌ చేశారు. ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ ఓజా అనే న్యాయవాది స్థానిక కోర్టులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, ఆదిత్య చోప్రా, జాన్ ఇబ్రహీం, సిద్ధార్థ్ ఆనంద్‌లపై ఫిర్యాదు చేశారు. పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్‌ పాట అభ్యంతరకరంగా ఉందని, హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తుందని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన అనంతరం ఓజా విలేకరులతో మాట్లాడారు. ఈ పిటిషన్‌పై కోర్టు జనవరి 3న విచారించనున్నది.

Exit mobile version