విధాత: తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్తాను ఎన్నికల కమిషన్ నియమించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని భావించిన ఎన్నికల కమిషన్ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసింది. డీజీపీ ఎంపిక కోసం మూడు పేర్లు పంపించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో సీ జీఏడీ సెక్రటరీ శేశాద్రితో పాటు సీనియర్ అధికారులతో సమావేశమైన ఎస్ శాంతి కుమారి సీనియర్ ఐపీఎస్ అధికారులైన రవిగుప్తా, జితేందర్, రాజీవ్ రతన్ పేర్లను ప్రతిపాదిస్తూ ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీంతో ఎన్నికల కమిషన్ ఇందులో రవిగుప్తాను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.