Site icon vidhaatha

ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓటుపై తాజా ఎగ్జిట్ పోల్ క్లారిటీ

న్యూఢిల్లీ: రాష్ట్రంలో విజయం సాధిస్తారనే అంశంలో సుదీర్ఘ విశ్లేషణ చేస్తున్న ఇండియా టుడే చానల్‌.. చర్చలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీల ఓటు కాంగ్రెస్‌కు గణనీయంగా వచ్చిందని ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తున్నది. ఇందులో బీఆరెస్‌కు ఎస్టీ ఓటింగ్‌ 34 శాతంగా ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్‌ పేర్కొన్నది.


అంటే బీఆరెస్‌కు గతంలో వచ్చిన ఓటింగ్‌లో పదిశాతం ఇక్కడ తగ్గుతున్నది. కాంగ్రెస్‌కు ఎస్టీ ఓటింగ్‌ 48 శాతం ఉన్నది. అంటే.. కొత్తగా ఎనిమిది శాతం పెరుగుదల కనిపిస్తున్నది. ఇక ఎస్సీల్లో బీఆరెస్‌కు 35శాతం (పదిశాతం తగ్గుదల), కాంగ్రెస్‌కు 51 శాతం (13 శాతం పెరుగుదల) ఉండే అవకాశాలున్నాయి. ఓబీసీల్లో కూడా బీఆరెస్‌ ఓటు షేరు తగ్గే అవకాశాలు ఉంటాయని ఇండియాటుడే అంచనా వేసింది. బీఆరెస్‌కు 34 శాతం ఓటింగ్‌ నమోదైందని, గతంతో పోల్చితే 16శాతం తగ్గుదల కనిపిస్తున్నదని తెలిపింది.


కాంగ్రెస్‌కు ఓబీసీల్లో 43 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది గతంకంటే 14 శాతం అధికం. బీజేపీకి ఎస్టీల్లో 13శాతం, ఎస్సీల్లో 9 శాతం, ఓబీసీల్లో 17 శాతం ఓట్లు లభించే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషించింది. ఎంఐఎంకు ఎస్టీల్లో 2శాతం, ఎస్సీల్లో 1 శాతం, ఓబీసీల్లో 1 శాతం ఓట్లు లభిస్తాయని లెక్కగట్టింది. ఇతరులు ఎస్టీల్లో 3 శాతం, ఎస్సీల్లో 4 శాతం, ఓబీసీల్లో 5 శాతం ఓట్లు రాబడుతారని పేర్కొన్నది.

Exit mobile version