Site icon vidhaatha

ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లో ధ‌న ప్ర‌వాహం.. నిన్న‌టి వ‌ర‌కు రూ. 347 కోట్లు సీజ్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లో ధ‌న ప్ర‌వాహం కొన‌సాగుతోంది. అక్టోబ‌ర్ 9 నుంచి గురువారం రాత్రి వ‌ర‌కు రూ. 347 కోట్లు సీజ్ చేసిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

నిన్న‌టి వ‌ర‌కు రూ.122.6 కోట్ల న‌గ‌దు, 230.9 కిలోల బంగారం, 1038.9 కిలోల వెండి, రూ.20.7 కోట్ల విలువ చేసే మ‌ద్యం, రూ. 17.18 కోట్ల విలువ చేసే గంజాయి, రూ.30.4 కోట్ల విలువ చేసే ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్న వెల్ల‌డించారు. ఇక రూ. 50 వేల‌కు మించి ప‌ట్టుబ‌డితే క‌చ్చితంగా ఆధారాలు చూపించాల‌ని, లేని ప‌క్షంలో ఆ న‌గ‌దు సీజ్ చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. కాబ‌ట్టి భారీ మొత్తంలో న‌గ‌దు, ఇత‌ర విలువైన వ‌స్తువులు త‌ర‌లిస్తున్న‌ప్పుడు ఆధారాలు త‌ప్ప‌నిస‌రిగా వెంట తెచ్చుకోవాల‌ని సూచిస్తున్నారు. 

Exit mobile version