Site icon vidhaatha

రెండు ఉద్యోగాలు.. రెండు లంచాలు.. వేరెవరికైనా సాధ్యమా?

విధాత : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అవినీతి లీలలు త‌వ్వుతున్న కొద్దీ మరిన్ని వెలుగు చూస్తున్నాయి. తొమ్మిదేండ్లుగా హెచ్‌ఎండీఏలో కింగ్‌ మేకర్‌గా వ్యవహ‌రించాడు. శివబాలకృష్ణ హెచ్‌ఎండీలో ప్లానింగ్‌ డైరక్టర్‌గా, కమిషనర్‌గా అరవింద్‌ కుమార్‌ ఉన్నారు. ఇదే సమయంలో ఎంఏయూడీలో డైరెక్టర్‌గా బాలకృష్ణ, స్పెషల్‌ సీఎస్‌గా అరవింద్‌కుమార్‌ ఉన్నారు. డబుల్‌ పోస్టులు, డబుల్‌ ఫైల్స్‌, డబుల్‌ సంతకాలతో.. డబుల్‌ లంచాలతో రెండు చేతులా శివబాలకృష్ణ సంపాదించాడని ఏసీబీ విచారణలో గుర్తించారు. ఒకే ఫైల్‌పై రెండు హోదాల్లో రెండురెండుసార్లు ప్రాసెస్‌ చేసి, రెండు చోట్ల సంతకాలతో రెండుచోట్ల లంచాలు తీసుకుని దండిగా సంపాదించాడని ఏసీబీ గుర్తించింది.

అరవింద్‌కుమార్‌ స్పెషల్‌ సీఎస్‌గా, కమిషనర్‌గా రావడంతో శివబాలకృష్ణ తన అవినీతి పర్వంలో మరింత రెచ్చిపోయి వ్యవహారాలు నడిపినట్లుగా ఏసీబీ విచారణలో తేలింది. డబుల్‌ రోల్‌, డబుల్‌ క్యాష్‌, డబుల్‌ డీల్స్‌సెట్‌ చేసి డబుల్‌ ఇన్‌కమ్‌కు శివబాలకృష్ణ ప్లాన్‌ చేసుకుని భారీగా అక్రమార్జన సాగించినట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే సీబీఐ 250కోట్లకు పైగా అక్రమాస్తులను శివబాలకృష్ణ వద్ధ గుర్తించింది. అతను ఐఏఎస్‌ అరవింద్‌కుమార్‌తో కలిసి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ నివేదిక సిద్ధం చేసింది. మరోవైపు అరవిందర్‌కుమార్‌ను సైతం విచారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది.

Exit mobile version