Site icon vidhaatha

Seven Police Sisters | ఆయ‌న‌కు ఏడుగురు కుమార్తెలు.. అంద‌రూ పోలీసులే.. ఎక్క‌డంటే..?

Seven Police Sisters | చాలా మంది ఆడ‌పిల్ల‌ల‌ను అస్య‌హించుకుంటారు. కూతురు పుడితే చాలు.. చాలా మంది మ‌గాళ్లు భార్య‌ల‌ను హింసిస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆ ఆడపిల్ల‌ల‌ను చంపేస్తుంటారు. విడాకుల‌కు కూడా వెనుకాడ‌రు. కానీ ఈ వ్య‌క్తి మాత్రం త‌న‌కు ఆడ‌పిల్ల‌లు సంతానం క‌లిగార‌ని ఏ మాత్రం నిరాశ చెంద‌లేదు. త‌న‌కు జ‌న్మించిన ఏడుగురు కుమార్తెల‌ను క‌ష్ట‌ప‌డి ఉన్న‌త విద్య చ‌దివించాడు. ఆ ఏడుగురు అమ్మాయిలు కూడా పోలీసులు ఉద్యోగాలు సాధించి, తండ్రి క‌ల‌ల‌ను సాకారం చేశారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు బీహార్​ పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సంపాదించారు. ఈ ఏడుగురికి ఒక త‌మ్ముడు కూడా ఉన్నాడు. మ‌రి ఈ సెవెన్ పోలీసు సిస్ట‌ర్స్ గురించి తెలుసుకోవాలంటే బీహార్ వెళ్లాల్సిందే.

బీహార్​లోని ఛప్రా జిల్లాకు చెందిన క‌మ‌ల్ సింగ్‌కు 8 మంది కూతుళ్లు. ఒక కుమారుడు. ఏడుగురు అమ్మాయిల్లో అనారోగ్య కారణంతో ఒక కుమార్తె చిన్నప్పుడే మృతి చెందింది. దీంతో మిగతావారిని ఎంతో కష్టపడి చదవించాడు. అయితే క‌మ‌ల్ సింగ్‌కు వ‌రుస‌గా అమ్మాయిలే జ‌న్మించ‌డంతో.. చాలా మంది సూటిపొటి మాట‌ల‌తో హింసించారు. దీంతో తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గురైన క‌మ‌ల్ సింగ్ త‌న పిల్ల‌ల‌తో స‌ర‌న్ జిల్లాలోని నాచాప్ గ్రామం నుంచి వెళ్లిపోయాడు. చ‌ప్రా జిల్లాలోని ఎక్మాలో క‌మ‌ల్ సింగ్ స్థిర‌ప‌డ్డాడు.

పిండి గిర్నీ న‌డుపుతూ.. బిడ్డ‌ల‌ను చ‌దివించాడు..

ఎక్మాలో వ్యవసాయం చేసుకుంటూనే తన కూమార్తెల సాయంతో ఇంటి వద్ద ఓ చిన్నపాటి పిండి గిర్నీని నడిపేవారు క‌మ‌ల్ సింగ్. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు. కానీ చ‌దువు ఆపేసి పిల్ల‌లంద‌రికీ పెళ్లిళ్లు చేయాల‌ని చాలా మంది సూచించారు. కానీ క‌మ‌ల్ సింగ్ ఎవ‌రి మాట విన‌లేదు. మొండి ప‌ట్టుద‌ల‌తో, వ‌చ్చిన అర‌కొర ఆదాయంతో వారు చ‌దువుకునే దాకా చ‌దివించారు.

పొలంలోనే ఈవెంట్స్ ప్రాక్టీస్.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రికి ఉద్యోగాలు..

ఉన్న‌త విద్య చ‌దివిన ఈ ఏడుగురు సిస్ట‌ర్స్.. పోలీసు ఉద్యోగాల‌పై దృష్టి సారించారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా కోచింగ్ ఏం తీసుకోలేదు. త‌మకున్న వ్య‌వ‌సాయ పొలంలోనే ఈవెంట్స్ ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. 2006లో తొలిసారిగా పెద్ద కూతురు సశస్త్ర సీమా బల్-ఎస్​ఎస్​బీలో కానిస్టేబుల్​ పోస్టుకు ఎంపికయ్యారు. దీంతో మిగతా వారందరికీ పోలీసు శాఖలో చేరాలనే ఆశ, ధైర్యం వచ్చింది. పెద్ద అక్క‌ను ఆద‌ర్శంగా తీసుకున్నారు మిగ‌తా వారంతా. రెండో సోదరి రాణి పెళ్లి తర్వాత 2009లో బీహార్​ పోలీస్​ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. అలా ఒకరితర్వాత ఒకరు వరుసగా ఇతర ఐదుగురు సోదరీమణులు కూడా ఎక్సైజ్​ శాఖ, సీఆర్​పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ దళాలకు ఎంపికయ్యారు.

బ‌హుమ‌తిగా నాన్న‌కు నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం..

పోలీసులుగా స్థిర‌ప‌డ్డ ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు.. నాన్న క‌మ‌ల్ సింగ్‌కు అరుదైన కానుక అందించారు. నాన్న గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశంతో.. ఎక్మాలో నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించి ఇచ్చారు. ఈ భ‌వ‌నంలోని ప‌లు ఫ్లాట్ల‌ను కిరాయిల‌కు ఇచ్చారు. కిరాయిలు నెల‌కు రూ. 20 వేల దాకా వ‌స్తాయి. వృద్ధ్యాపంలో ఉన్న తండ్రి క‌మ‌ల్ సింగ్.. కిరాయిల డ‌బ్బుతో హాయిగా జీవిస్తున్నాడు.

అక్క‌ల‌ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంది..

ఈ ఏడుగురు సిస్ట‌ర్స్‌కి ఒకే ఒక్క త‌మ్ముడు ఉన్నాడు. అత‌ని పేరు రాజీవ్ సింగ్. త‌న సోద‌రిమ‌ణులంతా పోలీసులు ఉద్యోగాలు సాధించడం త‌న‌కెంతో గ‌ర్వంగా ఉంద‌ని రాజీవ్ సింగ్ పేర్కొన్నాడు. త‌న అక్క‌లంతా త‌న సొమ్మును లాగేసుకుపోతార‌ని చాలా మంది చాలా ర‌కాలుగా మాట్లాడారు. కానీ వారే మాకు చాలా చేశారు. ఇల్లు క‌ట్టించి ఇచ్చారు. 

Exit mobile version