Site icon vidhaatha

Special Trains | వేసవి రద్దీ.. 32 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

Special Trains | వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూడు నెలలు పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లు సైతం ఉన్నాయి. రైళ్లను ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలాఖరు వరకు ఈ ప్రత్యేక రైళ్లు ఆయా మార్గాల్లో పరుగులు తీస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రైళ్లలో అరక్కోణం-తిరుపతి, సికింద్రాబాద్‌-డిబ్రూగఢ్‌, తిరుపతి-షిర్డీ సాయినగర్‌, హైదరాబాద్‌-గోరక్‌పూర్‌, సికింద్రాబాద్‌-రక్సల్‌, సికింద్రాబాద్‌-దానాపూర్‌, హైదరాబాద్‌-జైపూర్‌, షోలాపూర్‌-ఎల్‌ఎల్‌టీ ముంబయి, తిరుపతి-షోలాపూర్‌, సికింద్రాబాద్‌-తిరుపతితో పాటు 32 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.

 

 

Exit mobile version