Site icon vidhaatha

Telangana Assembly Elections | మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

Telangana Assembly Elections | న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ మ‌రికాసేప‌ట్లో విడుద‌ల కానుంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తెలంగాణ‌, మిజోరాం, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఈ మేర‌కు మీడియాకు స‌మాచారం అందించారు. న్యూఢిల్లీలోని రంగ్ భ‌వ‌న్ ఆడిటోరియంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి, షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. 

మిజోరం శాస‌న‌స‌భ ప‌ద‌వీకాలం ఈ ఏడాది డిసెంబ‌ర్ 17న ముగియ‌నుంది. మిజోరంలో మిజో నేష‌న‌ల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో శాస‌న‌స‌భ‌ల ప‌ద‌వీకాలాలు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో వివిధ తేదీల్లో ముగియ‌నున్నాయి. తెలంగాణ‌లో బీఆర్ఎస్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయి.

Exit mobile version