TS TET | విధాత : TS TET | ఎన్నో సంవత్సరాల నుంచి లక్షలాది మంది బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
రేపటి నుంచి అనగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, పేపర్- 1కు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
ఇక పేపర్-2కు కేవలం ఇద్దరు బీఈడీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే, గతేడాది జూన్ 12న తెలంగాణ విద్యాశాఖ టెట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.
మార్చి 26, 2022 నుంచి ఏప్రిల్ 12, 2022 వరకు దరఖాస్తులు స్వీకరించి.. 12న పరీక్ష నిర్వహించింది. అయితే త్వరలో టీచర్ రిక్రూట్‌మెంట్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు టెట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. టెట్ నిర్వహణ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నది.