Viral Video | శృతిమించిన హోలీ వేడుక‌లు.. దంప‌తుల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

iral Video | హోలీ వేడుక‌లు శృతి మించాయి. ప‌లు చోట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ హోలీ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకున్నారు. ఓ ఇద్ద‌ర‌మ్మాయిలు యాక్టివాపై వెళ్తూ.. రంగులు చ‌ల్లుకుంటూ న‌డిరోడ్డుపై రొమాన్స్‌లో మునిగిపోయారు. మ‌రో ఇద్ద‌రు యువ‌తులు మెట్రో రైల్లో రీల్స్ చేస్తూ ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించారు. అయితే ఓ జంట ప‌ట్ల కూడా కొంద‌రు దుండ‌గులు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు.

  • Publish Date - March 28, 2024 / 06:43 AM IST

Viral Video | హోలీ వేడుక‌లు శృతి మించాయి. ప‌లు చోట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ హోలీ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకున్నారు. ఓ ఇద్ద‌ర‌మ్మాయిలు యాక్టివాపై వెళ్తూ.. రంగులు చ‌ల్లుకుంటూ న‌డిరోడ్డుపై రొమాన్స్‌లో మునిగిపోయారు. మ‌రో ఇద్ద‌రు యువ‌తులు మెట్రో రైల్లో రీల్స్ చేస్తూ ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించారు. అయితే ఓ జంట ప‌ట్ల కూడా కొంద‌రు దుండ‌గులు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌ద‌శ్ వార‌ణాసిలోని మ‌ణిక‌ర్ణిక ఘాట్‌లో హోలీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. అక్క‌డ దంప‌తులిద్ద‌రూ ఘాట్ మెట్ల‌పై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా, కొంద‌రు అల్ల‌రిమూక‌లు వారి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఆ మ‌హిళ‌పై నీళ్లు చ‌ల్లుతూ హింసించారు. ఒక‌రిద్ద‌రు కాదు వంద‌ల మంది యువ‌కులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ఆ మృగాళ్లను దంప‌తులు ఎదురించలేకపోయారు.

అక్క‌డున్న వారిలో కొంద‌రు కూడా మాన‌వ‌త్వంతో అల్ల‌రిమూక‌ల‌ను ఆప‌లేక‌పోయారు. ఆ దంప‌తుల‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించి, మాన‌సికంగా హింసించారు. అయితే ఈ చ‌ర్య సిగ్గుచేటు అని, ఒక మ‌హిళ‌ను ప‌ట్టుకుని అలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు పేర్కొన్నారు. 

Latest News