జింక కోసం ప‌రుగెత్తిన రెండు పెద్ద పులులు.. వీడియో

పెద్ద పులులు ఆహారం కోసం ఇత‌ర జంతువుల‌ను వేటాడుతూ ఉంటాయి. చివ‌ర‌కు ప‌రుగెత్తైనా స‌రే ఆ జంతువును వేటాడి, భ‌క్షించి త‌మ ఆక‌లిని తీర్చుకుంటాయి.

  • Publish Date - February 13, 2024 / 03:23 AM IST

పెద్ద పులులు ఆహారం కోసం ఇత‌ర జంతువుల‌ను వేటాడుతూ ఉంటాయి. కంటికి క‌నిపించిన జంతువును మాత్రం పులులు వ‌దిలిపెట్ట‌వు. చివ‌ర‌కు ప‌రుగెత్తైనా స‌రే ఆ జంతువును వేటాడి, భ‌క్షించి త‌మ ఆక‌లిని తీర్చుకుంటాయి. అయితే రాజ‌స్థాన్‌లోని రాంథ‌మ్‌బోర్ నేష‌న‌ల్ పార్కులో ఓ రెండు పెద్ద పులులు జింక కోసం ప‌రుగెత్తాయి. ఆ రెండు పులులు కూడా అతి వేగంగా ప‌రుగెత్తాయి. కానీ చివ‌ర‌కు ఆ జింక ఆ పెద్ద పులుల నుంచి త‌ప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

రాంథ‌మ్‌బోర్ నేష‌న‌ల్ పార్కులో స‌ఫారీకి వెళ్లిన ప‌ర్యాట‌కులు ఈ దృశ్యాన్ని త‌మ కెమెరాల్లో బంధించారు. రెండు పులులు జింక వైపు ప‌రుగెత్తిన దృశ్యాన్ని రాంథ‌మ్‌బోర్ పార్కు ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు. ఫిబ్ర‌వ‌రి 11న పోస్టు చేయ‌గా వేల మంది వీక్షించారు. ల‌క్షల మంది లైక్ చేశారు.

రాంథ‌మ్‌బోర్ నేష‌న‌ల్ పార్కు రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌కు 130 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్స్, జంతు ప్రేమికులు త‌రుచుగా ఈ పార్కుకు వెళ్తుంటారు. స‌ఫారీ చేస్తూ అరుదైన దృశ్యాల‌ను త‌మ కెమెరాల్లో బంధింస్తుంటారు. ఇక ఈ పార్కులో కేవ‌లం పులులే కాదు.. ఎలుగుబంట్లు, చిరుత‌లు, న‌క్క‌లు, హైనాలు, ముంగీస‌లు కూడా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. 

Latest News