Viral Video | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై – గోవా జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని చిప్లణ్ నగరంలో ఎన్‌హెచ్ఏఐ నాలుగు లేన్లతో ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తోంది. అయితే ఓ చోట బ్రిడ్జికి పగుళ్లు వచ్చినట్లు ఇంజినీర్లు గుర్తించారు. దీంతో అటువైపు ఎవర్నీ వెళ్లనివ్వకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతం కావడంతో అటు వైపు ఎవర్నీ వెళ్లనివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఆ శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లై ఓవర్ కుప్పకూలిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Maharashtra | A pillar at the under-construction site of Mumbai-Goa four-lane highway collapsed today morning in Chiplun. Soon after, a portion of the flyover also collapsed, damaging a crane machine that was being used at the site. No injuries or casualties were… pic.twitter.com/m5iVsXCPhi
— ANI (@ANI) October 16, 2023