Viral Video | యంగ్ ఏజ్‌లో ఉన్న వారిని ఆంటీ, అంకుల్ అని చాలా కోపగించుకుంటారు. గుర్రుగా చూస్తారు. నీకు అలా కనిపిస్తున్నామా? అని ఆగ్రహంతో ఊగిపోతారు. ఇక నుంచి తనను అక్క, అన్న పిలవాలని సూచిస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలను ప్రతి రోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఈ మాదిరి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో వెలుగు చూసింది. రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అంకుల్ అని పిలిచినందుకు అతను కోపగించుకున్నాడు. ఇక్కడ అంకుల్ ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై లోకల్ రైల్లో ఓ ప్రయాణికుడు మెట్ల వద్ద కూర్చున్నాడు. బొరివలి స్టేషన్‌లో దిగాల్సిన ప్రయాణికులు ముందుకు వస్తున్నారు. మెట్ల వద్ద కూర్చున్న ప్రయాణికుడికి.. చలో అంకుల్, వచ్చే స్టేషన్ బొరివలి.. అక్కడ దిగాలి.. ఆ తర్వాత కూర్చో అని ఓ యువకుడు సూచించాడు. అతనేమి వినిపించుకోనట్టు అలాగే కూర్చున్నాడు. అంకుల్ కొంచెం లేవండి.. మేం దిగగానే మళ్లీ కూర్చుందువు కానీ అని మళ్లీ అడిగాడు. దీంతో సదరు ప్రయాణికుడు స్పందించాడు. మీరు ఎవర్ని ఉద్దేశించి అంకుల్ అంటున్నారు. ఇక్కడ ఎవరూ అంకుల్ లేరు కదా? అని ప్రశ్నించాడు. దీంతో మిగతా ప్రయాణికులు నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 69 వేల మంది వీక్షించారు.
Never call someone UNCLE inside a #MumbaiLocal