న్యూఢిల్లీ : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన చేస్తుండటం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. స్పీకర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీఎంసీ సహా ఇండియా కూటమి పక్షాలు అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నాయని, ఇందుకోసం 100మంది సభ్యుల సంతకాల మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల స్పీకర్ ఓం బిర్లా వైఖరి పట్ల విపక్షాల అసంతృప్తిగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగానికి కూడా స్పీకర్ పలుమార్లు అడ్డుతగలడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ గుర్రుగా ఉంది. ప్రతిపక్ష సభ్యులకు తగినంత సమయం ఇవ్వడం లేదని, అధికార పక్షం వైపు పనిచేస్తున్నారని, పారదర్శకతం, నిష్ఫాక్షికత లోపించిందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల సభ్యులు స్పీకర్ పై అవిశ్వాసం ప్రతిపాదనకు సిద్దమవుతున్నట్లుగా సమాచారం.
సోమవారం విపక్ష సభ్యుల నిరసన మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. దీంతో లోక్‌సభ స్పీకర్ తీరుకు ప్రతిపక్షాల సభ్యులు నిరసన తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచిస్తున్నారు. రాజ్యాంగంలో 94సీ ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే రోజు స్పీకర్ కు నోటీసులు ఇస్తారని సమాచారం. స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత సభ సజావుగా సాగాలని కోరుకోవట్లేదు అన్నారు. ఒకవేళ బడ్జెట్‌ను మూజువాణి ఓటుతో ఆమోదిస్తే ప్రతిపక్షం నష్టపోతుందిఅని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Techie safety allegation| కోటి సంపాదించే టెకీ జీవితానికి విలువ ఎక్కడా..?
Senior Heroes | 2027 సంక్రాంతి పోరు… చిరు, వెంకీ, నాగ్, బాలయ్య సినిమాలతో టాలీవుడ్‌లో భారీ హైప్
