Techie safety allegation| కోటి సంపాదించే టెకీ జీవితానికి విలువ ఎక్కడా..?

కోటి సంపాదించి..క్రమం తప్పకుండా దేశానికి పన్నులు కడుతున్న టెకీ జీవితానికే దేశంలో విలువ లేదంటూ ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు చేసిన ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది.

Techie safety allegation| కోటి సంపాదించే టెకీ జీవితానికి విలువ ఎక్కడా..?

విధాత : కోటి సంపాదించి..క్రమం తప్పకుండా దేశానికి పన్నులు కడుతున్న టెకీ జీవితానికే దేశంలో విలువ లేదంటూ ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు చేసిన ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది. బెంగళూరులో జరిగిన ‘హిట్ అండ్ రన్’ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఓవర్ లాయ్(over layy) ఏఐ స్టార్టప్ వ్యవస్థాకుడు స్నేహిల్ సలూజా పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి బెంగళూరు నగరంలో విలువ లేకుండాపోయిందంటూ ఆయన తన పోస్టులో ఆవేదన వెళ్లగక్కారు.

వివరాల్లోకి వెళితే.. స్నేహిల్ సలూజా సోదరి , ఆమె స్నేహితురాలు ఇద్దరూ కూడా స్నేహిల్ కారులో బెంగళూరు లోని ప్రయాణిస్తుండగా…ఓ రెడ్ లైట్ సిగ్నల్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారును మినీ ట్రక్కు ఒకటి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే ఈ ప్రమాదంలో ట్రక్కు యజమానిపట్ల పోలీసుల నిర్లక్ష్యాన్ని వారు ప్రశ్నించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ విషయం హైవే పోలీసులకు , ట్రక్కు యజమానికి కూడా తెలుసని, అయినా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌ను అరెస్టు చేయలేదని స్నేహిల్ ఆరోపించారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారని పేర్కొన్నాడు.

ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు..గాయపడలేదని..కేసు ఎందుకు? ఇన్సూరెన్స్‌తో సెటిల్ చేసుకోమని పోలీసులు బాధితులకు సూచించారని వెల్లడించారు. ఈ వివాదం సందర్భంగా ఓ అధికారి..బాధితులతో కేసు నమోదు ప్రయత్నాలు మానుకోవాలని, ఎందుకంటే ట్రక్కు యజమానులు పోలీసులకు క్రమం తప్పకుండా లంచాలు ఇస్తుంటారని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పినట్లుగా స్నేహిల్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తన సోదరి బెంగళూరు రోడ్లపై తిరగాలంటేనే భయపడుతోందని, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలపై నమ్మకం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టాన్ని గౌరవించే, పన్ను చెల్లించే నిపుణులను కూడా రక్షించడంలో వ్యవస్థ విఫలమైందని స్నేహిల్ పేర్కొన్నాడు. కోటి రూపాయల ఆర్జించి పన్నులు కట్టే వారి పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాధారణ పౌరులు వ్యవస్థను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనలోని బాధితుల్లో ఒకరు ప్రధాన డేటా కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉన్నత ఐఐటీ జేఈఈ ర్యాంక్ కలిగిన యువ ఏఐ ఇంజనీర్ అని గుర్తు చేశారు.ఇది 2025లో బెంగళూరు.. ఇది 2025లో భారతదేశం” అని స్నేహిల్ తన ట్వీట్ లో అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి క్లెయిమ్‌ను కూడా తిరస్కరించినట్లు వెల్లడించారు.