ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎస్సీ కోటాలో వర్ల రామయ్య, బీసీ కోటాలో దళవాయి రమాదేవిని చంద్రబాబు ఎంపిక చేశారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Aug 18, 2026, 3:34 pm IST
Read Time: 2 mins
ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ అభ్యర్ధులను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఎస్సీ కోటాలో టీడీసీ సీనియర్ నేత వర్ల రామయ్యను అభ్యర్థిగా ఎంపిక చేయగా…బీసీ కోటాలో అనంతపురానికి చెందిన మహిళా నేత దళవాయి రమాదేవిని ఎంపిక చేశారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న వర్ల రామయ్య.. గతంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. దళవాయి రమాదేవి అనంతపురం లోక్‌సభ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన రమాదేవికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం 55కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో స్థానిక సంస్థల్లో రూరల్‌ ప్రాంతాల్లో బీసీలకు 34శాతం, అర్బన్‌లో 33.1 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, మేయర్ల ఎన్నికలకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.