WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఏఐ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్న మెటా కంపెనీ..

  • Publish Date - March 26, 2024 / 03:38 AM IST

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ఈ క్రమంలో వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కంపెనీ కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంటుంది. తాజాగా వాట్సాప్‌లో ఏఐ ఆధారిత ఫీచర్‌ను తీసుకురాబోతున్నదని. ఈ ఫీచర్‌ సహాయంతో ఇమేట్‌లను ఎడిట్‌ చేసుకునే వీలు కలుగనున్నది. ఇటీవల కాలం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ వినియోగం బాగా పరిగిన విషయం తెలిసిందే. ఏఐని వాడేందుకు సైతం జనం ఆసక్తి చూపుతున్నారు. అయితే, వాట్సాప్‌ ప్రస్తుతం దీనిపై పని చేస్తున్నది. బీటా వెర్షన్‌ యూజర్స్‌కి త్వరలోనే అందుబాటులోకి వచ్చే వకాశం ఉందని ‘వీ బీటా ఇన్ఫో’ పేర్కొంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే యాప్‌లోని ఆప్షన్‌లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకునేందుకు వీలుంటుంది.

ఏఐ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఇమేజ్‌ను తమకు నచ్చినట్లుగా ఎడిట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇమేజ్‌ సైజ్‌, బ్యాక్‌గ్రౌండ్‌లను సైతం మార్చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ 2.24.7.13 వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్‌ ఎడిటర్‌ ఫీచర్‌ ప్రైమరీ కోడ్‌ను అందుబాటులో తీసుకువచ్చే వీలుంది. బీటా టెస్టర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మిగతా యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తున్నది. అదే సమయంలో సెర్చ్‌ బార్‌లో టైప్‌చేసి నేరుగా ఏఐ సర్వీస్‌తోనే చాటింగ్‌ చేసి కావాల్సిన ఫలితాలను చూపించే ఫీచర్‌పై సైతం వాట్సాప్‌ పని చేస్తున్నది. వాయిస్‌ నోట్‌ వచ్చే సందేశాలను ఓపెన్‌ చేయకుండానే టెక్ట్స్‌ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్‌ను యూజర్లకు తీసుకురాబోతున్నది. ఓపెన్‌ ఏఐకి చెందిన చాట్‌జీటీపీకి పోటీగా వాట్సప్‌లో మెటా ఏఐని రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Latest News