Site icon vidhaatha

Wines Closed | మందుబాబులకు షాకిచ్చిన పోలీసులు..! 25న వైన్‌ షాపులు బంద్‌.. కారణం ఏంటేంట..?

Wines Closed | మందుబాబులకు హైదరాబాద్‌ పోలీసులు షాకిచ్చారు. జంట నగరాల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు, పంప్‌లను మూసివేయనున్నట్లు ప్రకటించారు. హోలీ పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 25న సోమవారం హోలీ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు వైన్స్‌లు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

పండుగ సమయంలో మద్యం సేవించిన సమయంలో గొడవలు, వివాదాలకు దారి తీయకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా మద్యం షాపులను మూసివేస్తున్నట్లు పోలీసులు ఉత్తర్వుల్లో తెలిపారు. హోలీ సందర్భంగా మద్యం షాపుల బంద్‌తో పాటు ప్రజలకు పూలు జాగ్రత్తలు, హెచ్చరికలు జారీ చేశారు. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు. బలవంతంగా ఇతరులపై రంగులు చల్లొద్దని.. ఇబ్బంది పెట్టకూడదన్నారు. రోడ్లపై బైక్‌లు నడుపుతూ అరాచకంగా ప్రవర్తించవద్దని.. పండుగతో ఇతరులకు ఇబ్బందులకు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Exit mobile version