Viral Video | దేవి నవరాత్రులు గుజరాత్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాజ్‌కోట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి గర్భా డ్యాన్స్‌లతో అదరగొట్టారు.
తల్వార్లతో మహిళలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఒంటిచేత్తో నడుపుకుంటూ… ఓ మహిళ కత్తిసాము చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొందరు మహిళలు ద్విచక్ర వాహనాలు, జీపులను నడుపగా… ఇంకొందరూ మహిళలు వాటిపై నిలబడి… తల్వార్లతో విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలను వీక్షించేందుకు మహిళలు భారీగా సంఖ్యలో హాజరయ్యారు..
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 60 వేల మంది వీక్షించారు. అదేవిధంగా సదరు మహిళలను ప్రశంసిస్తూ నెటిజన్‌లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
#WATCH | Gujarat: Women in Rajkot perform ‘Garba’ on motorcycles and cars with swords in their hands, on the third of #Navratri (17.10) pic.twitter.com/AhbuiAwI7Y
— ANI (@ANI) October 17, 2023