BharatPe | భారత్‌పే వన్‌ డివైజ్‌ వచ్చేసింది..! అన్ని పేమెంట్లు ఒకే డివైజ్‌లో..!

BharatPe | ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పే తొలిసారిగా ఆల్‌ ఇన్‌ వన్‌ పేమెంట్‌ డివైజ్‌ను పరిచయం చేసింది. ఒకే పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్స్) మిషన్‌లో క్యూఆర్ కోడ్ డిస్ ప్లే, టాప్ అండ్ ప్లే ప్యానెల్, స్పీకర్ పొందుపరిచింది.

  • Publish Date - April 24, 2024 / 11:00 AM IST

BharatPe | ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పే తొలిసారిగా ఆల్‌ ఇన్‌ వన్‌ పేమెంట్‌ డివైజ్‌ను పరిచయం చేసింది. ఒకే పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్స్) మిషన్‌లో క్యూఆర్ కోడ్ డిస్ ప్లే, టాప్ అండ్ ప్లే ప్యానెల్, స్పీకర్ పొందుపరిచింది. సాధారణంగా దుకాణాల్లో కనిపించే పీఓఎస్ పరికరాలలో క్యూఆర్ కోడ్ డిస్ ప్లే, స్పీకర్ ఉండవు. ఈ క్రమంలో భారత్‌ పే తొలిసారిగా ఆల్‌ ఇన్‌ వన్‌ డివైజ్‌తో పీఓఎస్‌ సేవలతో పాటు క్యూఆర్ కోడ్, టాప్ అండ్ పే విధానంలోనూ డిజిటల్ చెల్లింపులు చేసేలా డివైజ్‌ను తీసుకువచ్చింది. చెల్లింపు జరిగినట్లుగా ఇందులో స్పీకర్‌ ద్వారా వివరాలను తెలుపుతుంది.

ఈ డివైజ్‌కు భారత్‌పే వన్‌గా నామకరణం చేసింది. తొలిదశలో ఈ పరికరాన్ని దేశంలోని 100 నగరాల్లో ప్రవేశపెట్టాలని భారత్ పే ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఆరు నెలల్లో 450 నగరాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఆల్ ఆన్ వన్ డివైస్ ఇటు దుకాణాదారులకు, అటు వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. సులభంగానే ఉపయోగించుకోవచ్చని చెప్పింది. పైలట్ ప్రాజెక్టుగా కొందరు దుకాణదారులకు ఈ పరికరాలను అందించామని, వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని కంపెనీ తెలిపింది.

Latest News