దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 50,279 వద్ద కొనసాగుతుండగా.నిఫ్టీ 164 పాయింట్లు ఎగబాకి 15,027 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.24 వద్ద కొనసాగుతోంది.
చెన్నై పెట్రో,ఎస్‌ఐఎస్ లిమిటెడ్, మోరిపెన్ ల్యాబ్స్, ఉజ్వాన్ స్మాల్ ఫైనాన్స్, మంగళూరు రీఫైనాన్స్ కంపెనీల షేర్లు భారీగా విలువ పెంచుకోగా.. పనాక బయోటెక్, స్పందన స్ఫూర్తి ఫినాన్స్, బీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్, బీఎఫ్‌యూటిలిటీస్, జైన్ ఇరిగేషన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.