Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవల భారీగా పెరుగుతూ వస్తున్న ధరలు గురువారం బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి తులానికి రూ.66,700కి దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 పతనమై తులానికి రూ.72,760కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,420 తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,760కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,910కి పతనమైంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,760 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా తగ్గింది. రూ.1200 తగ్గి రూ.96,500కి చేరింది. హైదరాబాద్‌లో కిలో రూ.1,01,000 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.