Gold Rate | బంగారం కొనుగోలుదారులకు బిగ్‌ రిలీఫ్‌.. నేడు మార్కెట్‌లో ధరలు ఇవే..!

Gold Rate | పసిడి ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన ధరలు దిగివస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,2400 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.75,110 వద్ద నిలకడగా ఉన్నది.

  • Publish Date - April 21, 2024 / 10:53 AM IST

Gold Rate | పసిడి ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన ధరలు దిగివస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,2400 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.75,110 వద్ద నిలకడగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.74,240 వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.68,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,390 ధర పలుకుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.74,240 వద్ద ట్రేడవుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.86,500 పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ.90వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Latest News