Gold Rates | బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అక్షయ రోజున సైతం ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం సైతం మరోసారి ధర దిగివచ్చింది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా బంగారం విక్రయాలు జోరుగా సాగాయి.
అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 1983 డాలర్లు పలుకుతోంది. ఇక వెండి రేటు ఔన్సుకు 25.13 డాలర్ల మార్క్ వద్ద ట్రేడవుతున్నది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.82.090 వద్ద కొనసాగుతోంది.
ఇక హైదరాబాద్‌లో బంగారం(Gold) ధరల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 వరకు తగ్గి రూ.55,750కి చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.330కి తగ్గి.. రూ.60,820 పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300 తగ్గి.. రూ.రూ.55,900 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.310 తగ్గి.. రూ.60,970కి చేరింది. ఇక వెండి ధర రూ.900 వరకు తగ్గి రూ.80,400 వద్ద కొనసాగుతున్నది. ఢిల్లీలో వెండిపై రూ.700 వరకు తగ్గి.. రూ.76,900 వద్ద ట్రేడవుతున్నది.