Gold Price |
దేశంలో బంగారానికి ఎంతో డిమాండ్ ఉంటుంది. భారతీయులు పుత్తడిపై ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. పండగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన ధరలు గతవారంలో స్వల్పంగా దిగి వచ్చాయి. అయినా, స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ.60వేలకుపైగా ఉన్నది. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై అత్యంత స్వల్పంగా రూ.30మాత్రమే తగ్గింది. ఇక 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.30, వెండిపై కిలోకు రూ.100 వరకు తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.55,720కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.60,790 వద్ద కొనసాగుతున్నది. ఇక కిలో వెండి హైదరాబాద్‌లో రూ.80,300గా ఉన్నది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అంతా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,050గా ఉన్నది. 24 క్యారెట్ల బంగారం రూ.61,150 వద్ద ట్రేడవుతున్నది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,720, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,790గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,850 ఉండగా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రూ.60,940 వద్ద ట్రేడవుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,840 వద్ద కొనసాగుతున్నది. ఇక ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.760 వరకు పెరిగి.. 29,650కి చేరింది.