Gold Rate | బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. బులియన్ మార్కెట్‌లో గురువారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే మరికొద్దిగా ధరలు దిగివచ్చాయి. అయితే, వెండి ధరలు మాత్రం స్వలంగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.110 తగ్గి.. రూ.54,450 పలుకుతుంది.
ఇక 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 తగ్గి రూ.59,400 వద్ద ట్రేడవుతున్నది. కిలో వెండిపై రూ.200 పెరిగి.. కిలోకు రూ.73వేలు పలుకుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,550కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్లు గోల్డ్ రూ.59,400కి చేరింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర రూ.59,950 పలుకుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,400 వద్ద కొనసాగుతున్నది.కేరళలో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్లు రూ.59,400 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసడి రూ.రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,400 వద్ద కొనసాగుతున్నది.
ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ఢిల్లీలో కిలోకు రూ.73వేలు పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ.76,200కి చేరింది.