Site icon vidhaatha

Gold-Silver Rates | మళ్లీ భారీగా పెరిగిన వెండి.. కిలో రూ.లక్ష దాటింది..!

Gold-Silver Rates | వెండి ధరలు మళ్లీ కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి. కిలో వెండి హైదరాబాద్‌లో రూ.లక్ష మార్క్‌ను దాటింది. ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మరో వైపు భారీగా పెరిగిన బంగారం ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.68,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.74,510 వద్ద కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,840 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.68,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.74,510 వద్ద నిలకడగా కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.68,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,660 వద్ద ట్రేడవుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.68,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.74,510 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది కిలోకు రూ.1300 వరకు పెరిగి.. ఢిల్లీలో కిలో రూ.95,800కి తగ్గింది. ఇక హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో రూ.1,00,300వేలకి ఎగిసింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version