India GDP | అంచనాలకు మించిన భారత వృద్ధి రేటు.. 3.5లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ..!

GDP | 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 7.8శాతం నమోదైంది. తయారీరంగం ఊతం లభించించడంతో అంచనాలకు మించి జీడీపీ వృద్ధిరేటును నమోదు చేసి.. దలాల్ స్ట్రీట్ అంచనాలను మించిపోయింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 8.2శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ ఇదే జోరును కొనసాగించే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Publish Date - June 1, 2024 / 07:30 AM IST

India GDP | 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 7.8శాతం నమోదైంది. తయారీరంగం ఊతం లభించించడంతో అంచనాలకు మించి జీడీపీ వృద్ధిరేటును నమోదు చేసి.. దలాల్ స్ట్రీట్ అంచనాలను మించిపోయింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 8.2శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ ఇదే జోరును కొనసాగించే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ 3.5 లక్షల కోట్ల డాలర్ల చేరడంతో పాటు రాబోయే కొద్ది సంవత్సరాల కాలంలోనే 5లక్షల కోట్ల డాలర్ల లక్ష్యం చేరబోతున్నది.

అయితే నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి) మాత్రం వృద్ధి రేటు 7.8 శాతానికి మందగించగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నమోదైన స్థూల జాతీయోత్పత్తి రేటు (GDL) 6.2 శాతం కాగా.. ఏడాది మొత్తానికి నమోదైన వృద్ధి రేటు 7 శాతంగా ఉన్నది. పొరుగు దేశమైనా చైనా ఆర్థిక వ్యవస్థ 2024 తొలి మూడు నెలల కాలంలో 5.3శాతం వృద్ధి రేటును నమోదు చేయగా.. భారత్‌ అధికంగా వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 సంవత్సరం వృద్ధి రేటుకు సంబంధించిన గణాంకాలను.. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం 7శాతం వృద్ధిని సాధిస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన డేటా ప్రకారం.. రంగాల వారీగా విశ్లేషిస్తే రియల్ గ్రాస్ వ్యాల్యూ 2022-23 ఆర్థిక సంవత్సరంలోని 6.7 శాతంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతానికి ఎగిసింది. ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను 3.5 ట్రిలియన్ డాలర్ల వైపు నడిపించినట్లయ్యింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు ఇది ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.2 శాతంగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63 శాతంగా రికార్డయ్యింది. వాస్తవానికి బడ్జెట్‌లో 5.8 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేయగా.. వాస్తవ రూపంలో చూసినప్పుడు ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం రూ.16.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు వెల్లడించాయి. స్థూలంగా పన్నుల రూపంలో రూ.23.26 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాగా వ్యయం రూ.44.42 లక్షల కోట్లుగా ఉన్నది.

Latest News