Hero bikes | జూలై 1 నుంచి పెరగనున్న ‘హీరో’ బైకుల ధరలు..!

Hero bikes | వచ్చే నెల 1వ తేదీ నుంచి హీరో (Hero) కంపెనీ బైకుల ధరలు పెరగనున్నాయి. తమ ఎంపిక చేసిన మాడల్‌ ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు హీరో మోటో కార్పొరేషన్ (Hero moto corporation) ప్రకటించింది. అయితే ఏ మోడల్ బైకు మీద ఎంత ధరను పెంచనున్నది మాత్రం ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.

  • Publish Date - June 24, 2024 / 08:47 PM IST

Hero bikes : వచ్చే నెల 1వ తేదీ నుంచి హీరో (Hero) కంపెనీ బైకుల ధరలు పెరగనున్నాయి. తమ ఎంపిక చేసిన మాడల్‌ ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు హీరో మోటో కార్పొరేషన్ (Hero moto corporation) ప్రకటించింది. అయితే ఏ మోడల్ బైకు మీద ఎంత ధరను పెంచనున్నది మాత్రం ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.

ఒకవేళ పెంచేటట్టయితే ఒక్కో బైకు మీద రూ.1500 వరకు పెంచే అవకాశం ఉంది. మోడల్‌ను బట్టి ధర పెంపు ఉండనున్నది. హీరో మోటార్ సైకిళ్లలో స్ప్లెండర్ ప్లస్ (Splender plus), హెచ్ఎఫ్ డీలక్స్ (HF delux), హెచ్ఎఫ్ 100 (HF 100), ప్యాషన్ ప్లస్ (Passion plus), ప్యాషన్ ఎక్స్ టెక్ (Passion Extech), సూపర్ స్ల్పెండర్ (Super splender), గ్లామర్ ఎక్స్ టెక్ (Glamer extech), ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ (Xtream 125 R), ఎక్స్ ట్రీమ్ 4వి (Xtream 4V), ఎక్స్ ట్రీమ్ 200 4వి (Xtream 200V), ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ (Xtream 160 R), మావ్రిక్ 440 (Mavrick 440) ఉన్నాయి.

ఇక హీరో స్కూటర్లలో హీరో డెస్టినీ ప్రైమ్ (Hero Destini Prime), డెస్టినీ 125 ఎక్స్‌టీఈసీ (Hero Destini 125 Xtec), హీరో జూమ్ (Hero Xoom), ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ (Pleasure plus xtec) మోడళ్లు ఉన్నాయి.

Latest News