Honor 200 Series | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ కొత్తగా 200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతున్నది. ఈ మోడల్ జూలై 18న లాంచ్ కాబోతున్నది. లాంచ్‌కు ముందే మోడల్ ఫీచర్స్ లీకయ్యాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటెంట్ బేస్డ్ యూఐ ఫోన్‌గా తీసుకువస్తున్నది. హానర్ 200 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్‌జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది.
గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ కార్డ్ సెటప్ ఉంటుంది. దాంతో అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందించనున్నది. మొబైల్ గరిష్ఠంగా 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. వెనీలా వేరియంట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా, ఫీల్డ్ ఆఫ్ వ్యూ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుండగా.. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నది. ఇక హానర్ 200 ప్రో గరిష్ఠంగా 16జీబీ ర్యామ్, టీబీ స్టోరేజ్‌తో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెసో 735 జీపీయూ కార్డ్ అమర్చారు.
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కెమెరాతోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియా కాలింగ్ కోసం మరో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 మ్యాజిక్ ఆధారిత ఓఎస్‌పై పని చేయనున్నాయి. హానర్ 200 ప్రో వేరియంట్‌లో 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర రూ.40వేల వరకు ఉండే అవకాశం ఉన్నది. 16 జీబీ – టీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ రూ.51వేలు ఉండే అవకాశాలున్నాయి.