Honor 200 | రెండు ఫోన్లను మార్కెట్‌లోకి వదిలిన హానర్‌..! ధర, ఏం ఫీచర్స్‌ వస్తున్నాయంటే..?

Honor 200 | ప్రముఖ మొబైల్స్‌ తయారీ కంపెనీ హానర్ మరో సరికొత్త ఫోన్‌ని పరిచయం చేసింది. హానర్‌ 200 సిరీస్‌ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌, ఆకర్షణీయమైన డిజైన్‌తో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్‌ చేసింది.

  • Publish Date - May 29, 2024 / 11:00 AM IST

Honor 200 | ప్రముఖ మొబైల్స్‌ తయారీ కంపెనీ హానర్ మరో సరికొత్త ఫోన్‌ని పరిచయం చేసింది. హానర్‌ 200 సిరీస్‌ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌, ఆకర్షణీయమైన డిజైన్‌తో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్‌ చేసింది. ప్రస్తుతం చైన్‌ మార్కెట్‌లోనే విడుదల కాగా.. జూన్‌ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ లాంచ్‌ అవనున్నది. ఈ హానర్‌ 200 సిరీస్‌ మొబైల్స్ ఫీచర్స్‌, ధర వివరాలేంటో తెలుసుకుందాం.. హానర్ 200 బేస్ మోడల్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఓఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్‌జ్‌ రిఫ్రెషరేట్‌తో వస్తుంది.

స్నాప్ డ్రాగన్ 7 జెన్ ఎస్ఓసీ విత్ అడ్రెనో 720 జీపీయూ ప్రాసెసర్, 16 జీబీ వరకు ర్యామ్‌, 512 జీబీ వరకు స్టోరేజ్‌ ఉంటుంది. ఇక హానర్‌ 200 ప్రో మోడల్‌ మొబైల్‌ 6.78 ఇంచెస్‌ డిస్‌ప్లే ఉంటుంది. అడ్రెనో 735 జీపీయూ ఆధారిత స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ సెటప్‌తో వస్తుంది. 16 జీబీ వరకు ర్యామ్‌, స్టోరేజీ టీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 వెర్షన్‌తో వస్తాయి. హానర్ 200 మోడల్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 856 సెన్సార్‌ ఉంటాయి.

హానర్ 200 ప్రో మోడల్‌లోనూ రియర్‌లో సేమ్‌ కెమెరా ఉంటుంది. అయితే, మెయిన్ కెమెరా ఓమ్నీ విజన్ OV50 హెచ్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీ కోసం రెండు మోడల్స్‌లోనూ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 సెన్సార్ ఉంటాయి. అయితే ప్రో వెర్షన్‌లో అదనంగా 3డీ డెప్త్ కెమెరా ఉండడం విశేషం. రెండు ఫోన్లలోనూ 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్‌, 100 వాట్ సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది.

సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే హానర్ 200 ప్రారంభ ధర రూ. 31,000 కాగా.. హానర్ 200 ప్రో మోడల్ ప్రారంభ ధర రూ.40,200గా నిర్ణయించింది. ర్యామ్‌, స్టోరేజ్‌ని బట్టి ధర మారన్నుది. కోరల్ పింక్, మూన్ షాడో వైట్, స్కై బ్లూ, వెల్వెట్ బ్లాక్ రంగుల్లో రానున్నాయి. ఈ ఫోన్లు సోమవారం చైనాలో లాంచ్‌ కాగా.. ఈ నెల 31 నుంచి సేల్స్‌ మొదలవనున్నాయి. జూన్‌ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నది.

Latest News