Site icon vidhaatha

IQOO 13 | మార్కెట్‌లోకి సరికొత్త మోడల్‌ ఫీచర్‌ ఫోన్‌.. Iqoo 13 స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌.. ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే..!

IQOO 13 | చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ ఐక్యూకు మార్కెట్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉన్నది. ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌, అద్భుతమైన ఫీచర్లతో కూడిన మొబైల్స్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన పలు మోడల్స్‌ యూజర్లను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి మరో సరికొత్త మోడల్‌ను లాంచ్‌ చేయబోతున్నది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతున్నది. కంపెనీ మొదట చైనాలో ఈ మోడల్‌ను లాంచ్‌ చేయనుండగా.. దీనికి ఐక్యూ 13 పేరుతో లాంచ్‌ చేయనున్నది.

బుధవారం (అక్టోబర్‌ 30)న లాంచ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత భారత్‌లో ఈ-కామర్స్‌ అమెజాన్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఈ మోడల్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో విడుదలవనుండగా.. స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే 2కే రిజల్యూషన్‌తో రానున్నట్లు టాక్‌. దాంతో పాటు బీఓఈ క్యూ10 8టీ ఎల్‌టీపీవో డిస్‌ప్లేతో రానున్నది. ప్రీమియం బిల్డ్‌ క్వాలిటీతో పాటు అద్భుతమైన కెమెరా సెటప్‌తో రానున్నట్లు తెలుస్తున్నది. రియర్‌లో కెమెరా సెటప్‌ చూసేందుకు అద్భుతంగా ఉన్నది. చుట్టూ హాలో లైట్‌ ఫీచర్‌ సైతం ఉంటుంది. అలాగే డైనమిక్‌ లైటింగ్‌ ఎఫెక్ట్‌ సపోర్ట్‌ సైతం రానున్నది. జంబో బ్యాటరీ ప్యాక్‌తో రానున్నది. ప్రస్తుతం ఐక్యూ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మోడల్‌ ల్యాండింగ్‌ పేజీని ప్రదర్శిస్తున్నది.

మొదట చైనాలో ఆ తర్వాత.. గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు పేర్కొంది. ఇక ఫీచర్స్‌, స్పెసిఫికేషన్‌ విషయానికి.. Q10 8T LTPO OLED డిస్‌ప్లే, 2కే రిజల్యూషన్ ఉండనున్నది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 6150mAh పెద్ద బ్యాటరీ సెటప్‌, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నది. 50MP మెయిన్‌ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా.. ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా సెటప్‌ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది. ప్రస్తుతం చైనాలో రూ.59,999 ధరగా నిర్ణయించింది.

Exit mobile version