Lava 02 Mobile | భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ లావా. ఈ ఫోన్లకు దేశీయంగా మంచి మార్కెట్ ఉన్నది. ఈ క్రమంలో కంపెనీ సరికొత్త మోడల్స్‌ను తీసుకువస్తున్నది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌ను ఉన్న మొబైల్స్‌ను తీసుకువస్తూ యువతను ఆకర్షిస్తున్నది. తక్కువ ధరలోనే బెస్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇటీవల లావా విడుదల చేసిన స్మార్ మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌పై అందిస్తున్నది. లావా ఇటీవల లావా 02 స్మార్ట్ మొబైల్‌ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మొబైల్‌పై డిస్కౌంట్‌తో పాటు అదనంగా ఎక్స్ఛేంజ్, బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది.
ఇక స్టోరేజ్ విషయానికొస్తే కంపెనీ దీన్ని కేవలం ఒకే స్టోరేజ్ ఆప్షన్‌తో మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ అసలు రూ.9999 కాగా.. స్పెషల్ డీల్‌లో కొనుగోలు చేసే వారికి 20శాతం తగ్గింపుపై డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ.7999కే అందుబాటులో ఉన్నది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లించి ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే వారికి అదనంగా క్యాష్ బ్యాక్ సైతం లభించనున్నది. అలాగే, ఈఎంఐ ఆప్షన్ సైతం అందుబాటులో ఉన్నది.
లావా O2 ఫీచర్స్ ఇవే..
6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్
మీడియాటెక్ హీలియో జీ35 చిప్‌సెట్
టీ616 ఓక్టాకోర్ ప్రాసెసర్
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
50 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా
2మెగా పిక్సల్ డెప్త్ కెమెరా
8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
డ్యూయల్ 4జీ VoLTE
వై-ఫై 802.11 b/g/n
బ్లూటూత్ 5.0 వెర్షన్
జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ
డ్యూయల్ సిమ్
3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
ఎఫ్‌ఎం రేడియో