Ola Electric Bike | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా( Dasara ), దీపావళి( Diwali ) పండుగ సందడి నెలకొంది. ఇక ప్రతి పండుగకు వాహనాల తయారీ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో మార్కెట్‌లోకి కొత్త ఫీచర్స్‌తో కలిగిన వాహనాలను విడుదల చేస్తుంటారు. అంతేకాకుండా ఆ వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. ఆ మాదిరిగా ఈ దసరా, దీపావళి పండుగలకు ప్రముఖ కంపెనీ ఓలా.. ఎలక్ట్రిక్ బైక్( Ola Electric Bike ) లపై సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.75,000 ఉన్న ఓలా స్కూటర్( Ola Scooter ) ధర ఏకంగా రూ.25 వేలు తగ్గింది. దీంతో ఇప్పుడు ఈ బైక్ ధర రూ.49,999 మాత్రమే.
అక్టోబర్ 3వ తేదీ నుంచి దీపావళి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు ఓలా కంపెనీ( Ola Company ) ప్రకటించింది. మార్కెట్‌లో ఓలా ఎస్1( Ola S1 ) కు సంబంధించి అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్1 స్కూటర్ ప్రారంభ మోడల్(Ola S1 X )ను రూ. 49,999కే విక్రయించనున్నారు. 2 కిలోవాట్ బ్యాటరీ ఉండే ఈ స్కూటర్‌ను ఒకసారి ఛార్జి చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గరిష్ఠ వేగం 85 కిలోమీటర్లు అని సంస్థ పేర్కొన్నది. నిల్వలు ఉన్నంత వరకే ఈ బైక్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామని తెలిపింది.
ఓలా ఎస్1ఎక్స్ (Ola S1x)
ఓలా ఎస్1ఎక్స్ మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌లో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 95 కిలోమీటర్ల రేంజ్‌ను, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 151 కిలోమీటర్ల రేంజ్‌ని, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 193 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air)
ఓలా ఎస్1 ఎయిర్ 6 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్టిఫైడ్ రేంజ్ 151 కిలోమీటర్లుగా ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,07,499 నుంచి ప్రారంభం అవుతుంది.
ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)
ఓలా ఎస్1 ప్రో 11 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 195 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఈవీ గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. ఆఫర్‌కు ముందు ఓలా ఎస్1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర ప్రారంభ ధర రూ.1,34,999గా ఉండేది.
The @OlaElectric BOSS sale – Biggest Ola Season Sale, is now open for early access to our amazing community for today! Crazy offers and exclusive benefits!⚡️
As crazy as Ola S1 scooters starting at just ₹49,999!! 🙌
The BOSS of all products, prices, EVs is here 😉 pic.twitter.com/NcdnDXEw9H
— Bhavish Aggarwal (@bhash) October 2, 2024