Site icon vidhaatha

Costly Whisky | మద్యం తాగితే కాదు.. ధర వింటేనే కిక్కెక్కుతుంది..! రాంపూర్‌ సింగిల్‌ మాల్ట్‌ విస్కీ రేట్‌ ఎంతో తెలుసా..?

Costly Whisky | దేశవ్యాప్తంగా ఎంతో మందికి మద్యం అలవాటున్నది. మందుబాబు మద్యం కిక్‌ను ఎంజాయ్‌ చేస్తుంటారు. పలువురు సంపన్నులు కిక్కుతో పాటు ప్రత్యేకంగా ఉండాలని ఆలోచిస్తుంటారు. అందుకే ఖరీదైన మద్యాన్ని కొనుగోలు చేసి సేవిస్తుంటారు. అయితే, భారత్‌లో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసుకుందాం రండి..! రాంపూర్‌ డిస్టిలరీస్‌ 75 వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీని తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది.

అయితే, ఇందులో కేవలం 4వేల బాటిల్స్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. మందుబాబులు ఇప్పటికే 3,998 మద్యం బాటిల్స్ కొనుగోలు చేశారు. మరో రెండు మాత్రం మిగిలిపోయాయని.. అవి కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయని కంపెనీ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. అక్షరాలా ఈ మద్యం బాటిల్‌ ధర రూ.5లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. రాంపూర్ సిగ్నేచర్ రిజర్వ్ భారతదేశంలోని వివిధ సీజన్లలో అమెరికన్ స్టాండర్డ్ ఓక్ బారెల్స్‌లో ప్రాసెస్ చేసినట్లు చెప్పింది. పురాతనమైన మాల్ట్‌లలో ఇది కూడా ఒకటి.

అయితే, దీన్ని తయారు చేయడం కన్నా స్టోర్‌ చేయడమే ఇబ్బందిగా ఉంటుందని కంపెనీ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. బాటిల్ ప్రత్యేకంగా ఉండడంతో పాటుగా.. బాటిల్‌పై ఓ సిగ్నేచర్ సైతం ఉంటుంది. ఇతర దేశాల్లో ఈ కంపెనీ తయారు చేసే విస్కీలకు ఫుల్ డిమాండ్‌ ఉంది. దీని ధర రూ.8,500 నుంచి రూ.5లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే, ధరను ఏమాత్రం పట్టించుకోకుండా.. ప్రత్యేకంగా తయారు చేయించుకొని కొనుగోలు చేస్తుండడం మరో విషయం.

Exit mobile version