Satya Nadella | మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదేళ్లకు షాక్‌.. రూ.27లక్షల జరిమానా విధించిన కేంద్రం..!

Satya Nadella | మైక్రోసాఫ్ట్‌ సీఈవోతో పాటు పలువురికి కేంద్రం షాక్‌ ఇచ్చింది. కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు రూ.27లక్షల వరకు జరిమానా విధించింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్‌ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా ఏడుగురు వ్యక్తులకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది. 

  • Publish Date - May 23, 2024 / 09:00 AM IST

Satya Nadella | మైక్రోసాఫ్ట్‌ సీఈవోతో పాటు పలువురికి కేంద్రం షాక్‌ ఇచ్చింది. కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు రూ.27లక్షల వరకు జరిమానా విధించింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్‌ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా ఏడుగురు వ్యక్తులకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు జరిమానాలకు గల కారనాలను వివరిస్తూ 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (RoC) జారీ చేసింది. లింక్డ్‌ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్‌బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని మంత్రిత్వ శాఖ ఆ ఆర్డర్‌లో ఆరోపించింది.

చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్‌ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్‌కీ నివేదించలేదని చెప్పింది. మైక్రోసాఫ్ట్‌ డిసెంబర్‌ 2016లో ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్‌ను కొనుగోలు చేసింది. బెనిఫిషియల్‌ ఓనర్‌ (SBO) నిబంధనలను ఉల్లంఘించారని కంపెనీల రిజిస్ట్రార్ (ఢిల్లీ-హర్యానా) పేర్కొన్నారు. లింక్డ్‌ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా లింక్డ్‌ఇన్ ఇండియా, నాదెల్లా, లింక్డ్‌ఇన్ CEO ర్యాన్ రోస్లాన్స్కీతో పాటు ఏడుగురు వ్యక్తులకు ఆర్‌ఓసీ మొత్తం రూ.27,10,800 జరిమానా విధించింది. ఎస్‌ఓబీ నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్‌ఇన్ ఇండియాకు రూ.7లక్షల జరిమానా విధించింది.

నాదెల్లా, రోస్లాన్స్కీలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల జరిమానా విధించారు. జరిమానాకు గురైన మిగతా వారిలో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్ండార్ఫ్, మిచెల్ కాటి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చిన్నింగ్ ఫాంగ్ ఉన్నారు. ఉత్తర్వుల ప్రకారం సత్య నాదెళ్ల, ర్యాన్‌ రోస్లాన్స్కీ చెప్పిన కంపెనీ విషయంలో ఎస్‌ఓబీలు, సెక్షన్‌ 90(1) ప్రకారం నివేదించడంలో విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 90(10) ప్రకారం జరిమానా విధించారు. 2020 జూన్ 1న లింక్డ్‌ఇన్ కార్పొరేషన్‌కి గ్లోబల్ సీఈవోగా ర్యాన్ రోస్లాన్స్కీ నియమితులయ్యారు.

చట్టంలోని సెక్షన్ 90 ఎస్‌ఓబీలతో వ్యహరిస్తుంది. ఇందుకోసం కంపెనీలు ఎస్‌బీఓ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆర్డర్ ప్రకారం కంపెనీకి సంబంధించి ఎస్‌బీఓలను గుర్తించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యానికి కంపెనీ, దాని అధికారులు బాధ్యత వహిస్తారని ఆర్డర్‌లో స్పష్టం చేసింది. లింక్డ్‌ఇన్ ఇండియా మైక్రోసాఫ్ట్ గ్రూప్‌కు అనుబంధంగా స్థాపించగా.. ఆర్డర్‌కి వ్యతిరేకంగా అప్పీల్‌ను ఈ ఆర్డర్ అందిన తేదీ నుంచి 60 రోజులలోపు ప్రాంతీయ డైరెక్టర్ (NR)కి దాఖలు చేయవచ్చని ఆర్డర్‌లో పేర్కొంది.

Latest News