విధాత: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహార పథకం (SNP) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వస్తువులు,కూరగాయలు, గ్యాస్ సరఫరాలు,ఇంటి అద్దెల వంటి ఖర్చుల కోసం మొత్తం రూ.156 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో,ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులను వెంటనే సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లోపు అన్ని జిల్లాలు తమ బిల్లులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని ఈ ఆదేశాల్లో పేర్కొంది.
అంగన్వాడి కేంద్రాలకు రూ. 156 కోట్లు విడుదల
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహార పథకం (SNP) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది.
