షాక్‌ ఇచ్చిన వాట్సాప్‌..! భారత్‌లో 76.26లక్షల అకౌంట్లను బ్యాన్‌ చేసిన మెటా కంపెనీ..!

  • Publish Date - April 2, 2024 / 12:14 PM IST

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్‌ షాక్‌ ఇచ్చింది. ఏకంగా ఒకే నెలలలో 76లక్షల భారత యూజర్ల అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఫిబ్రవరి నెలలోనే ఐటీ నిబంధనల మేరకు 76లక్షల అకౌంట్లకుపైగా నిషేధించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 29 మధ్య 76.26లక్షల అకౌంట్లు నిషేధించినట్లు పేర్కొంది. ఇందులో ఎలాంటి ఫిర్యాదులు రాక ముందే 14.24లక్షల అకౌంట్లను బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ పేర్కొంది. దేశంలో 500 మిలియన్లకుపైగా వాట్సాప్‌కు అకౌంట్లున్నాయి. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 16,618 ఫిర్యాదులు వచ్చాయి. మెటా యాజమాన్యంలో కంపెనీ జనవరి ఒకటి నుంచి 31 మధ్య భారత్‌లో 67.28లక్షల అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఇందులో 13.58లక్షల ఫిర్యాదులు రాక ముందే నిషేధించింది. యూజర్స్ నుంచి వచ్చే ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేస్తూ వస్తున్నది.

Latest News