Bank rules | బ్యాంకు ఖాతాదారులూ బహుపరాక్‌.. మే నెలలో రూల్స్‌ మారుతున్నాయ్‌..!

Bank rules | ఇప్పుడు ఆర్థక లావాదేవీలు అన్ని బ్యాంకులతోనే ముడిపడి ఉన్నాయి. మనం డబ్బు దాచుకోవాలన్నా, దాచిన డబ్బును తిరిగి తీసుకోవాలన్నా, దాచిన దాంట్లోంచి ఎవరికైనా చెల్లింపులు చేయాలన్నా, కొనుగోలు చేసిన వస్తువులకు, తీసుకున్న వివిధ రకాల లోన్‌లకు నెలవారీ వాయిదాలు చెల్లించాలన్న బ్యాంకుల పాత్రే కీలకం. అయితే ఇలా రకరకాల సేవలు అందిస్తున్న బ్యాంకులు ఆయా సేవలకు చార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి. అంతేకాదు లావాదేవీల విషయంలో బ్యాంకు రూల్స్‌కు అనుగుణంగా ఖాతాదారు నడుచుకోకపోతే జరిమానాలు కూడా విధిస్తుంటాయి.

  • Publish Date - April 27, 2024 / 10:56 AM IST

Bank rules : ఇప్పుడు ఆర్థక లావాదేవీలు అన్ని బ్యాంకులతోనే ముడిపడి ఉన్నాయి. మనం డబ్బు దాచుకోవాలన్నా, దాచిన డబ్బును తిరిగి తీసుకోవాలన్నా, దాచిన దాంట్లోంచి ఎవరికైనా చెల్లింపులు చేయాలన్నా, కొనుగోలు చేసిన వస్తువులకు, తీసుకున్న వివిధ రకాల లోన్‌లకు నెలవారీ వాయిదాలు చెల్లించాలన్న బ్యాంకుల పాత్రే కీలకం. అయితే ఇలా రకరకాల సేవలు అందిస్తున్న బ్యాంకులు ఆయా సేవలకు చార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి. అంతేకాదు లావాదేవీల విషయంలో బ్యాంకు రూల్స్‌కు అనుగుణంగా ఖాతాదారు నడుచుకోకపోతే జరిమానాలు కూడా విధిస్తుంటాయి. ఈ బ్యాంక్‌ రూల్స్‌ ఏటా మారుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ మార్పులను తెలుసుకోకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మే నెలలో కొన్ని బ్యాంకుల రూల్స్‌ మారుతున్నాయి. మరి ఏ బ్యాంకులో ఏ మార్పులో ఇప్పుడు తెలుసుకుందాం..

యస్ బ్యాంక్

యస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. మే 1 నుంచి వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మారుతుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్‌ మినిమమ్‌ యావరేజ్‌ బ్యాలెన్స్ (MAB) రూ.50,000 చేశారు. మినిమం బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయకపోతే గరిష్టంగా రూ.1000 చార్జి చేయాలని నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ.25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుము రూ.750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్‌ ప్రోలో కనీస నిల్వ రూ.10,000. దీనిపై కూడా గరిష్ట రుసుము రూ.750గా మారింది.

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్‌, ఈసీఎస్‌ / ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు సహా కొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1 నుంచి అమలులోకి వస్తాయి. డెబిట్ కార్డు వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ.200 ఉండనున్నాయి. చెక్‌ బుక్‌ విషయానికి వస్తే 25 లీఫ్స్‌ వరకు ఎలాంటి ఛార్జ్‌ ఉండదు. ఆపైన ఒక్క చెక్‌ లీఫ్‌కు రూ.4 చొప్పున చెల్లించాలి. డీడీ క్యాన్సిలేషన్‌, డూప్లికేట్‌, రీవ్యాలిడేషన్‌ చార్జీలను రూ.100గా బ్యాంక్‌ సవరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ. ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం అమలు చేస్తున్న ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్‌డీ’ గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం కింద, సీనియర్ సిటిజన్‌లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తుంది. 5 నుంచి పదేళ్ల కాలపరిమితి ఎఫ్‌డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్‌లు రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు.

Latest News