70th National Film Awards । జాతీయ 70వ చలన చిత్ర అవార్డులను (National Film Awards) శుక్రవారం ప్రకటించారు. అందరూ ఊహించినట్టే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ కాంతారా (Kantara) సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు.. ప్రధాన పాత్రలో నటించిన రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. మరోవైపు మలయాళ సినిమా అట్టమ్ (Attam) ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కైవసం చేసుకున్నది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2 ఎంపికైంది. కర్ణాటక కోస్తా ప్రాంతంలోని జానపద కళ, అక్కడి ఆదివాసీల భూమి హక్కుల చుట్టూ తిరిగే కథాంశంతో తీసిన ఈ సినిమా బహుభాషల్లో విడులై ప్రజాదరణ పొందింది. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి (Rishab Shetty)తోపాటు ఇతర పాత్రధారులు అద్భుతంగా నటించారు. ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం అవార్డు కూడా కాంతారాకు దక్కింది.
అట్టమ్ సినిమాకు ఆనంద్ ఏకార్షి (Anand Ekarshi) దర్శకత్వం వహించారు. లైంగిక వేధింపులు (sexual harassment), లింగ కోణాలు, మానవ నైతిక ప్రవర్తనలోని సంక్షిష్టాంశాల ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించారు. తిరుచిచిత్రంబళం (Thiruchitrambalam) సినిమాలో నటించిన నిత్యామీనన్ (Nithya Menen)కు, కచ్ ఎక్స్‌ప్రెస్‌లో (Kutch Express) నటించిన మానసి పరేఖ్‌కు (Maansi Paarekh) సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటి (best actress) అవార్డును ప్రకటించారు. ఉత్తమ దర్శకుడి అవార్డును ఊంచాయి చిత్రానికి గాను సూరజ్ ఆర్ బర్జ్యాత్య గెలుచుకున్నారు. ఊంచాయి సినిమాలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తాకు ఉత్తమ సపోర్టింగ్ నటి అవార్డు లభించింది. ఫౌజా సినిమాలో నటించిన పవన్ మల్హోత్రాకు ఉత్తమ సపోర్టింగ్ నటుడి అవార్డు వచ్చింది.
షర్మిలా ఠాగూర్, మనోజ్ బాజ్‌పాయి ప్రధాన పాత్రలు పోషించిన గుల్‌మొహర్ సినిమా ఉత్తమ హిందీ సినిమాగా ఎంపికైంది. ఈ సినిమాకు బాజ్‌పాయ్‌కి ప్రత్యేక అవార్డు లభించింది.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 (movie Ponnyin Selvan-Part 1) సినిమాకు నేపథ్య సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు పొందారు. ఈ సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను ఫిల్మ్ జ్యూరీకి నేతృత్వం వహిస్తున్న రాహుల్ రావల్ ప్రకటించారు.
అవార్డు గ్రహీతల జాబితా ఇదే
ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ : అట్టమ్
ఉత్తమ నటుడు : రిషబ్ శెట్టి, కాంతారా
ఉత్తమ నటి : నిత్యా మీనన్ (తిరుచిత్రబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ దర్శకుడు : సూరజ్ ఆర్ బర్జాత్యా (ఊంచాయి)
ఉత్తమ సహాయ నటి : నీనా గుప్తా (ఊంచాయి)
ఉత్తమ సహాయ నటుడు : పవన్ మల్హోత్రా (ఫౌజీ)
ఉత్తమ పాపులర్ చలన చిత్రం (కాంతారా)
ఉత్తమ తొలి చిత్రం : ఫౌజా (ప్రమోద్ కుమార్)
ఉత్తమ తెలుగు చిత్రం : కార్తికేయ 2
ఉత్తమ తమిళ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 1
ఉత్తమ పంజాబీ చిత్రం : బాఘీ దీ ధీ
ఉత్తమ ఒడియా చిత్రం : దామన్
ఉత్తమ మలయాళ చిత్రం : సౌదీ వెలక్కా CC.225/2009
ఉత్తమ మరాఠీ చిత్రం : వాల్వి
ఉత్తమ కన్నడ చిత్రం : KGF: చాప్టర్ 2
ఉత్తమ హిందీ చిత్రం : గుల్మోహర్
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : KGF: చాప్టర్ 2
ఉత్తమ కొరియోగ్రఫీ : తిరుచిత్రబళం
ఉత్తమ గీతం : ఫౌజా
ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతమ్ (పాటలు), ఏఆర్ రెహమాన్ (నేపథ్య సంగీతం)
ఉత్తమ మేకప్ : అపరాజితో
ఉత్తమ కాస్ట్యూమ్స్ : కచ్ ఎక్స్‌ప్రెస్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : అపరాజితో
ఉత్తమ ఎడిటింగ్ : ఆట్టమ్
ఉత్తమ సౌండ్ డిజైన్ : పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 1
ఉత్తమ స్క్రీన్‌ప్లే : ఆట్టమ్
ఉత్తమ సంభాషణలు : గుల్మోహర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 1
ఉత్తమ నేపథ్య గాయని : బాంబే జయశ్రీ (సౌదీ వెలక్కా సీసీ.225/2009)
ఉత్తమ నేపథ్య గాయకుడు: అరిజిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర,)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ – మల్లికప్పురంలో శ్రీపత్
సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ : కచ్ ఎక్స్‌ప్రెస్
ఉత్తమ డాక్యుమెంటరీ : మర్మర్స్ ఆఫ్ ది జంగిల్