Venkatesh Joins In Mana Shankara Vara Prasad Garu Shoot | ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ షూటింగ్ లోకి వెంకీ మామా ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్ జాయిన్ అయ్యారు. ఇద్దరు అగ్రతారలను డైరెక్ట్ చేయడం మ్యాజికల్ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Chiranjeevi and Venkatesh

విధాత : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ సినిమా షూట్‌లో వెంకటేష్ జాయిన్ అయినట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్సే వేదికగా ప్రకటించాడు.
ప్రతి ఫిల్మ్ మేకర్ జీవితంలో నిజంగా మ్యాజికల్ అనిపించే క్షణాలు ఉంటాయని.. ఇద్దరు అగ్రతారలను డైరక్ట్ చేస్తున్న ఈ క్షణాలు నాకు అలాంటి క్షణాలలో ఒకటి అనిల్ రావిపూడి వెల్లడించారు.తెలుగు సినిమా యొక్క ఇద్దరు అత్యంత ప్రసిద్ధ తారలు, మెగాస్టార్
చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు తెరపై కలిసి నటించడం నేను ఎప్పటికీ గర్వించే గౌరవించే ఘట్టమని పేర్కొన్నారు. మనశంకరవరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి కుటుంబాలను ఒకచోట చేర్చే వేడుక అని అభివర్ణించారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ఫ్యామిలీలోకి వెంకీకి స్వాగతం అంటూ చిరంజీవి డైలాగ్ లో వీడియో షేర్ చేశారు.

సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో చిరు, వెంకీలతో పాటు నయనతార, కేథరీన్, రోహిత్ బుల్లి రాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక అదిరిపోయే సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.