విధాత: మెగాహీరో కొణిదెల రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన మరోసారి తల్లి కాబోతున్నారు. తన నివాసంలో జరిగిన దీపావళి వేడుకల వీడియోను షేర్ చేసిన ఉపాసన..మళ్లీ తల్లి కాబోతున్నట్లుగా హింట్ ఇవ్వడం విశేషం. ఈ దీపావళి వేడుకలో మెగా కోడలు సీమంతం సీన్స్ తో ఈ వీడియో సాగింది. ఈ వేడుకలకు మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి దపంతులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ దంపతులు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తదితరులు హాజరయ్యారు.తో పాటు టాలీవుడ్ ప్రముఖ నటులు, తదితరులు కూడా హాజరయ్యారు. ఉపాసన తన వీడియోకు “ఈ దీపావళి వేడుక రెట్టింపు ఆనందం, రెట్టింపు ప్రేమ, రెట్టింపు ఆశీర్వాదాలతో నిండిపోయింది” అని క్యాప్షన్ గా రాశారు. వీడియో చివర్లో “న్యూ బిగినింగ్స్” (కొత్త ప్రారంభాలు) అని కూడా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇదివరకే అమ్మాయి క్లింకారా జన్మించిన సంగతి తెలిసిందే. ఈ దఫా అబ్బాయి పుట్టాలని మెగా కుటుంబం ఆశిస్తుంది. ప్రస్తుత్తం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న పెద్ది సినిమాలో బిజీగా ఉన్నారు. మార్చి 27కు ఈ సినిమా విడుదల కానుంది. మెగా కుటుంబంలో ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు సెప్టెంబర్ 10వ తేదీన మగ బిడ్డ జన్మించారు. ఈ చిన్నారికి తాజాగా ఃవాయువ్ తేజ్ నామకరణం చేశారు.
This Diwali was all about double the celebration, double the love & double the blessings.
🙏🙏 pic.twitter.com/YuSYmL82dd— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025