Abhishek Bachchan| అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యారాయ్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలంతా కలిసి వచ్చారు. ఐశ్వర్యారాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్యతో విడిగా వచ్చారు. దీంతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల రూమర్స్ మరింత పెరిగాయి. ఐశ్వర్యారాయ్ తన భర్త నుండి విడాకులు తీసుకొని కుమార్తె ఆరాధ్యతో కలిసి విడిగా ఉంటున్నారు అని ప్రచారాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో అభిషేక్ బచ్చన్ ఓ పోస్ట్‌ని లైక్ చేయడంతో ఇప్పుడు వారి విడాకులపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా.. ‘విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జీవితం సాగదు.ప్రేమ కష్టంగా మారినప్పుడు.. విడాకులు తీసుకోవడం సులభం కాదు. మనం అనుకున్నట్టు కొన్ని సార్లు జీవితం సాగదు. దశాబ్ధాల పాటు కలిసి ఉండి, వేరుపడిన తర్వాత ఎలా ఉంటారని ,బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం’ అని ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. అయితే అభిషేక్ బచ్చన్ ఈ పోస్ట్‌ని లైక్ చేయడంతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బంధానికి బ్రేక్ పడిందా అన్న వదంతులు మొదలయ్యాయి.
2007లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన ‘గురూ’ షూటింగ్ సమయంలో ఐశ్వర్యతో ప్రేమలో పడిన అభిషేక్.. ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఆమెకి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇక ఆ ప్రపోజల్‌కి ఐష్ ఒప్పుకోవడం, కొన్నాళ్లకే వారిద్దరు వివాహం చేసుకోవడం, ఇక వీరికి ఆరాధ్య అనే పాప జన్మించడం మనం చూశాం. అయితే పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఐశ్వర్య.. ఆరాధ్య పుట్టిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐష్ అంత రెగ్యులర్‌గా సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలలో కనిపించి సందడి చేస్తుంది.