Chiranjeevi Deep Fake Video : చిరంజీవి డీప్ ఫేక్ కేసులో విచారణ: సీపీ సజ్జనార్

మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోల కేసులో విచారణకు కీలక మలుపు. ఇంతకీ సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఆ వీడియోలు ఏ రకమైనవి? దీనిపై కోర్టు ఎలాంటి కఠిన ఆదేశాలు ఇచ్చింది?

Ciranjeevi Deep Fake Video
విధాత, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ కేసులో విచారణ కొనసాగుతుందని హైదరాబాద్ సీసీ సజ్జానర్ తెలిపారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేపడుతామని తెలిపారు. ఇటీవల సెలబ్రెటీలకు డీప్ ఫేక్ వీడియోలు తలనొప్పిగా మారాయి. చివరకు
మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు.
సైబర్ నేరగాళ్లు చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారు. దీనిపై చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పరువు, ఆర్థిక హక్కులకు ఆ వీడియోలు భంగం కలిగిస్తున్నాయంటూ సిటీ సివిల్ కోర్టును సైతం ఆశ్రయించారు. డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్, బిరుదులను వాణిజ్య, వ్యక్తిగత ప్రచారాలకు ఉపయోగించవద్దని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్‌ చేసిన 30 మందికి పైగానే  నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.