Actress|నేను ఎంత చెప్పిన నా భ‌ర్త వినలేదు… రాత్రికి రాత్రి రెండు కోట్లు పోగొట్టాడన్న న‌టి

Actress| న‌టి తుల‌సిని చూస్తే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. బాలనటిగా అనేక చిత్రాలలో నటించి మెప్పించిన తులసి ఆ తరువాత హీరోయిన్‌గా ట్రై చేసింది. ఇక చివ‌రికి క్యారెక్ట‌ర్

  • Publish Date - April 21, 2024 / 07:20 PM IST

Actress| న‌టి తుల‌సిని చూస్తే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. బాలనటిగా అనేక చిత్రాలలో నటించి మెప్పించిన తులసి ఆ తరువాత హీరోయిన్‌గా ట్రై చేసింది. ఇక చివ‌రికి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స్థిర‌ప‌డింది. అయితే మ‌ధ్య‌లో ఆమెకి కాస్త గ్యాప్ వచ్చిన కూడా ఇప్పుడు తిరిగి సినిమాల‌తో బిజీ అయింది. తెలుగు సినిమాల‌కి సంబంధించిన అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె చెన్నై నుండి హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అయింది. ఆమె అడ‌పాద‌డ‌పా త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన విష‌యాలు తెలియ‌జేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. తుల‌సి న 28 ఏళ్ల వయసులో కన్నడ డైరెక్టర్ అయిన శివమణి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరికి సాయి అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అయితే తులసి, శివమణి ఇద్దరు కూడా నటి నటులుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతూనే మ‌రోవైపు నిర్మాత‌గా కూడా మారారు. అయితే తుల‌సి భ‌ర్త శివ‌మ‌ణి రాత్రికా రాత్రే రెండు కోట్ల రూపాయాల‌ని పోగొట్టార‌ట‌. తుల‌సి భ‌ర్త శివ‌మ‌ణికి తానే హీరోగా,ద‌ర్శ‌కుడిగా సినిమా తీయాల‌ని ఉండేద‌ట‌. ఆ క్ర‌మంలో ఆయ‌న సొంతంగా రెండు కోట్లు పెట్టి చిత్రం తీయ‌గా, అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ట‌. తాను వ‌ద్దు అని చెప్పిన కూడా తుల‌సి భ‌ర్త శివ‌మ‌ణి విన‌కుండా ఆ సినిమా చేయ‌డం, రెండు కోట్ల రూపాయలను పోవ‌డం జ‌రిగింద‌ట‌. ఇక అప్ప‌టి నుండి మ‌నీ విష‌యంలో వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నార‌ట‌.

ఇప్పుడు తుల‌సి కూడా డ‌బ్బులు బాగానే సంపాదిస్తుండ‌గా, ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు అంటుంది.సౌత్ ఇండియాలో త‌న‌కి అంద‌రు కూడా పిలిచి మంచి క్యారెక్ట‌ర్స్ ఇస్తున్నార‌ని, కాక‌పోతే దానిని కాపాడుకోవంలోనే తాను విఫ‌లం అయ్యానంటూ తుల‌సి చెప్పుకొచ్చింది. అయితే రానున్న రోజుల‌లో ఆ త‌ప్పు జ‌ర‌గ‌కుండా చూసుకుంటాను అని తుల‌సి చెబుతుంది. ఇక నా భర్త చేసే అప్పులు నాకు ఎలాంటి సంబంధం లేదు అని, అయన ఎంత వద్దు చెప్పినా వినకుండా చేసే పనికి నేను బాధ్యత వహించను అంటూ కూడా తుల‌సి చెప్పుకొచ్చింది.తుల‌సి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Latest News