అందంతో పాటు నటనతో మెప్పిస్తోన్న అందాల అనన్య రాజ్.. లేటేస్ట్ పిక్స్ చూశారా

అనన్య రాజ్.. ఓ అందాల నటి.. వరుస సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లో అవకాశాలు దక్కించుకుంటోన్న బ్యూటీ. ఇప్పటికే ఈ భామ అటు హిందీ సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్‌లో నటిస్తూ.. సత్తాను చాటుతోంది

అనన్య రాజ్.. ఓ అందాల నటి.. వరుస సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లో అవకాశాలు దక్కించుకుంటోన్న బ్యూటీ. ఇప్పటికే ఈ భామ అటు హిందీ సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్‌లో నటిస్తూ.. సత్తాను చాటుతోంది. ఈ భామ ఇటీవల తెలుగులో కూడా కొన్ని సినిమాలను, వెబ్ సిరీస్‌లను చేసింది. సరైనా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అనన్య పర్సనల్ విషయానికి వస్తే.. 18 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. లాక్మే, కోకాకోలా, లక్స్, సామ్‌సంగ్, జబాంగ్, ఉబర్, అమెజాన్ వంటి ప్రముఖ బ్రాండ్‌లలో మోడల్‌గా పనిచేసే వావ్ అనిపించింది.




 


ఓ వైపు మోడలింగ్ చేస్తూనే.. సినిమాలపై ఉన్న ఆసక్తితో అనన్య తన సినీ రంగ ప్రవేశం చేసింది. అందులో భాగంగా కునాల్ రాయ్ కపూర్ 2018లో ‘ది ఫైనల్ ఎగ్జిట్’ అనే ఇండీ చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత వషు భగ్నాని నిర్మించిన ‘ఘోస్ట్’ (2019) చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలలో ఒకటిగా కనిపించింది. ఇక ఆమె లేటెస్ట్‌గా నటించిన సినిమా ‘తగ్గెదే లే’ (2022). ఈ సినిమా ఆ మధ్య విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.




 


సినిమాలతో పాటు “గాలిబ్” అనే ఓ మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది. ఈ పాటను లిలిబెట్ పిక్చర్స్ నిర్మించింది. జీ సంగీత సంస్థ విడుదల చేసింది. ఈ పాటతో ఆమె దర్శకురాలిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన మరో వెబ్ సిరీస్.. “హైడోస్”. ఈ వెబ్ సిరీస్‌ను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ దిలీప్ వాసుదేవ్ నిర్మించారు. ఆమె సరసన జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు ఉపేంద్ర లిమాయే కూడా నటించారు, త్వరలో హాట్‌స్టార్‌లో విడుదల కానుంది!