Site icon vidhaatha

Tamannaah Bhatia | పాఠ్యాంశంగా మిల్కీ బ్యూటీ తమన్నా జీవిత చరిత్ర..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..!

Tamannaah Bhatia | టాలీవుడ్‌ అగ్రహీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. కెరియర్‌లో మొదట చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసిన మిల్కీ బ్యూటీ.. కొద్దిరోజుల్లోనే తనదైన నటనతో అగ్రహీరోయిన్‌ వరకు తెగింది. అయితే, తమన్నా తనకు సంబంధం లేకుండా ఓ వివాదంలో చిక్కుకున్నది. ఏడో తరగతి స్కూల్ బుక్‌లో తమన్నా పేరుతో ప్రత్యేక పాఠ్యాంశం ఉండడమే దీనికి కారణం. అయితే, ఈ పాఠ్యాంశంపై విద్యార్థుల తల్లీదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తల్లీదండ్రులు ఏకంగా స్థానిక బాల‌ల హ‌క్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హీరోయిన్ తమన్నా గ్లామర్ రోల్స్ పోషించిన నేపథ్యంలో తన లైఫ్ హిస్టరీని బుక్‌లో పాఠ్యాంశంగా రూపొందించడం ఏమాత్రం సరికాదని తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు.

అయితే, తమన్నా సింధీకి చెందిన వ్యక్తికావడంతో ఆమె లైఫ్‌ హిస్టరీని పాఠ్యాంశంగా పెట్టినట్లు స్కూల్‌ యాజమాన్యం తెలుపుతున్నది. ఆ పాఠ్యాంశాన్ని వ్యతిరేకిస్తే పిల్లలకు టీసీ ఇస్తామని స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని విద్యార్థుల తల్లీదండ్రులు పేర్కొంటున్నారు. ఈ ఘటన గురించి తమన్నా స్పందిస్తారా చూడాల్సిందే. అయితే. కర్ణాటకలోని అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఈ ఫిర్యాదు విషయంలో విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. సంబంధిత పాఠశాల అధికారులు ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడటానికి నిరాకరించినట్లు సమాచారం. అయితే, తమన్నా తనకు ఏ సంబంధం లేని వార్త ద్వారా సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇటీవల బాక్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వేద, స్త్రీ-2, ఓదెల-2 చిత్రాల్లో నటిస్తున్నది.

Exit mobile version