Site icon vidhaatha

Aishwarya Rai|ఆ డాక్ట‌ర్‌తో మరింత స‌న్నిహితంగా ఐశ్వ‌ర్య‌రాయ్… అందుకే విడాకులా..!

Aishwarya Rai| అందానికి అభిన‌యం తోడైతే వ‌చ్చే రూపమే ఐశ్వ‌ర్య‌రాయ్ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆమె అందానికి కోట్లాది అభిమానులున్నారు. 1994 లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఐశ్వర్య రాయ్ విన్నర్ గా నిలిచారు. మిస్ వరల్డ్‌ టైటిల్ తో పాటు మిస్ క్యాట్ వాక్, మిస్ మిరాకులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్ టైటిళ్ళు కూడా ఆమె గెలుచుకుంది. 50 ఏళ్ళ ఐశ్వర్య ఇప్పటికీ వన్నె తరగని అందంతో వెండితెరను ఏలుతున్నారు. హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీషుల్లో కలిపి చాలా బాష‌ల‌లో సినిమాలు చేసింది. ఐశ్వర్య ప్రేమ వ్యవహారం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.

బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే వివేక్ ఒబెరాయ్ తో ప్రేమ వ్యవహారం నడిపిన ఈ భామ అత‌నితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండేది. ఎందుకో స‌డెన్‌గా అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. ఇక ఆ త‌ర్వాత సల్మాన్ తో ఐశ్వర్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింది. కొన్నాళ్ల‌కి అతనితో నావల్ల కాదంటూ విడిపోయింది. సల్మాన్ తనని చాలాసార్లు కొట్టాడని కూడా చెప్పుకొచ్చింది ఐశ్వ‌ర్య‌. ఇక 2007లో అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య వివాహం చాలా ఘనంగా జరిగింది. అప్ప‌టి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు ఈ జంట‌. ఇటీవ‌లి కాలంలో వీరి విడాకుల ప్రచారం ఆగడం లేదు. ఆ మ‌ధ్య అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హజరయ్యారు ఈ లవ్లీ కపుల్. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరు కాగా, అభిషేక్ మాత్రం అమితాబ్, జయ బచ్చన్ తో కలిసి అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన‌డంతో వీరి విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల విషయం మధ్యలోకి కొత్తగా ఓ డాక్టర్ పేరు వచ్చింది. ఆ డాక్టర్ పేరు జిరాక్ మార్కర్ కాగా, అత‌ను ఐష్‌కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంద‌ని, ఆ కార‌ణం వ‌ల్ల‌నే అభిషేక్‌తో ఐశ్వ‌ర్య విడాకులు తీసుకున్నారంటూ బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్ చాలా కాలంగా స్నేహితులు కాగా, వారు ఇప్ప‌టికీ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండ‌డం వ‌ల్ల‌నే అభిషేక్ విడాకులు ఇచ్చాడ‌ని అంటున్నారు. ఇటీవల, ఒక ఈవెంట్‌లో ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్‌కు సంబంధించి కలిసి ఉన్న ఫొటోలు బయటకు రాగా, ఇందులో ఇద్ద‌రు చాలా సాన్నిహిత్యంగా క‌నిపించారు.

Exit mobile version