Kantara Chapter 1 Australia Box Office Record | అస్ట్రేలియాలో కాంతార చాప్టర్ 1 కొత్త రికార్డు!

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ₹105 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹717.50 కోట్లు వసూలు చేసింది.

Kantara Chapter 1

విధాత : కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా దేశ, విదేశాల్లోనూ కలెక్షన్లలో కొత్త రికార్డులు నమోదు చేస్తూ దూసుకపోతుంది. తాజాగా కాంతార చాప్టర్1 తన ఖాతాలో మరో రికార్డు వేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా ఘనత దక్కించుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించి.. స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్‌, గుల్షన్‌ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈసినిమాకు అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందించగా,,అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు.

తెలుగులో రాష్ట్రాల్లోనూ రికార్డు..

కాంతార చాప్టర్-1 తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్‌ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్‌ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.